ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MAHAPADAYATRA: 14వ రోజూ ఉత్సాహంగా.. అమరావతి మహాపాదయాత్ర - అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర 14వ రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా యరజర్ల శివార్లలో ఈ రోజు యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులకు స్థానిక రైతులతోపాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు.

amaravathi-farmers-fourteenth-day-padayathra
14వ రోజూ ఉత్సాహంగా సాగుతున్న మహాపాదయాత్ర

By

Published : Nov 14, 2021, 12:11 PM IST

Updated : Nov 14, 2021, 2:25 PM IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర 14వ రోజూ ఉత్సాహంగా సాగుతోంది. యరజర్ల శివార్లలో మొదలైన యాత్రకు.. ప్రకాశం జిల్లావాసులు, రైతులతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మద్దతు పలికుతుకున్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి సంఘీభావం తెలిపారు.

14వ రోజూ ఉత్సాహంగా సాగుతున్న మహాపాదయాత్ర

ప్రకాశం జిల్లాలోకి ఈ మాహాపాదయాత్ర వచ్చినప్పటి నుంచి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు కందులూరుకు వస్తే... ముస్లింలు, మస్లిం జేఏసీ కింద ఈరోజు ఘనస్వాగతం పలుకుతా ఉన్నరు. దళితులు కూడా స్వాగతం పలుకుతా ఉన్నరు. బీసీలు, బీసీ జేఏసీ కింద స్వాగతం పలకతా ఉన్నరు. అంటే ఈ అమరావతి రాజధాని అన్ని వర్గాల ప్రజలది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ... అందరిదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నరు. ఈ పాదయాత్రకు మా జిల్లా మంత్రి ఫొటోలతో కూడా రైతులు పాదయాత్రలో పాల్గొంటున్నరు. మా జిల్లా మంత్రి ఫొటోలతోటి.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలతోటి ట్రాక్టర్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం మీరు చూస్తున్నారంటే... వైకాపాలో కూడా మహాపాదయాత్రకు మద్దతు పలుకుతుందనే విషయం తెలియజేస్తూ... ఈ యాత్ర దగ్విజయంగా సాగాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ... వర్షాలైనా కూడా వర్షం కూడా మేము కదలకముందే ఆగిపోయి.. వరుణదేవుడు కూడా మాకు సహకరిస్తున్నాడు. విజయవంతం కావాలని మనస్పూర్తిగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాను.- డోలా బాలవీరాంజనేయస్వామి, కొండపి ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రకు అన్ని వర్గాలనుంచీ.. మద్దతు లభిస్తోందని అన్నారు. వైకాపా శ్రేణులు కూడా మద్దతు తెలుపుతున్నాయని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు పెట్టుకుని మరీ సంఘీభావం తెలపడానికి వస్తున్నారని అన్నారు. భావితరాల కోసం అమరావతి రాజధానిగా ఉండాలని పలువురు విద్యార్థులు అన్నారు. అప్పుడే.. తమలాంటి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

అంటే ప్రజలలో నిర్లిప్తమైన రాష్ట్రానికి సంబంధించి ఒకే రాజధాని ఉండాలని చెప్పేసేసి.. అది అమరావతే కావాలని ప్రజల మనోభావాలు ఈ పాదయాత్ర ద్వారా తెలియజేసుకుంటూ ప్రతీ ఒక్క గ్రామంలో పూలు, హారతులతోటి ఈ మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతున్నరు. కచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి తన చేసిన అనాలోచితమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసేసి కోరుకుంటున్నాను జై అమరావతి.- రైతు, అమరావతి

అమరావతి రైతుల మహాపాదయాత్రకు టంగుటూరు మండలం కందులూరులో ఘనస్వాగతం లభించింది. దారి వెంట బంతిపూలు పరిచిన కందులూరు గ్రామస్థులు..... ముక్తకంఠంతో అమరావతి రైతులకు మద్దతు పలికారు. సుమారు కిలోమీటర్ మేర పూలబాటపై రైతుల పాదయాత్ర సాగింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

POLLING START: ప్రశాంతంగా సాగుతున్న.. స్థానిక ఎన్నికల పోలింగ్

Last Updated : Nov 14, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details