చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కరణం బలరాం ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపర్చారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఆయనకు నలుగురు సంతానం అయితే... అఫిడవిట్లో ముగ్గురు సంతానం అని తప్పుగా పేర్కొన్నట్లు తెలిపారు. విజయవాడ వైకాపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కరణం బలరాంకు నలుగురు సంతానమని... కరణం అంబిక కృష్ణ ఆయన కూతురేనని చెప్పారు. అంబిక కృష్ణ జనన ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు అందుకు ఆధారమని పేర్కొన్నారు. తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు బలరాంను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
కరణం బలరాం తప్పుడు వివరాలు ఇచ్చారు: ఆమంచి - AmanchI Krishna Mohan Fires On Karanam Balaram
ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కరణం బలరాం... ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపర్చారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు.

ఆమంచి కృష్ణమోహన్