ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంటరానితనం నిర్ములిద్దాం.. నినాదంతో దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర - ధీరజ్ కుమార్ గుప్తా

AKHILA BHARATA CYCLE YATRA: అంటరానితనం నిర్ములిద్దాం అనే నినాదం తో పంజాబ్ రాష్ట్రం లోని పఠాన్ కోట్ నుండి ధీరజ్ కుమార్ గుప్తా అనే యువకుడు అఖిల భారత సైకిల్ యాత్రను 2021 నవంబర్ లో ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చేరుకున్నాడు.

అఖిల భారత సైకిల్ యాత్ర
AKHILA BHARATA CYCLE YATRA

By

Published : Jan 21, 2023, 8:41 PM IST

AKHILA BHARATA CYCLE YATRA: అంటరానితనం నిర్ములిద్దాం అనే నినాదం తో పంజాబ్ రాష్ట్రం లోని పఠాన్ కోట్ నుండి ధీరజ్ కుమార్ గుప్తా అనే యువకుడు అఖిల భారత సైకిల్ యాత్రను 2021 నవంబర్ లో ప్రారంభించాడు. ఈ సైకిల్ యాత్ర 14 నెలల కాలంలో 12,415 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కు చేరుకున్నాడు. ధీరజ్ కుమార్ కు పలు పలువురు స్వాగతం పలికారు. ప్రధాన కూడలి నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధీరజ్ కుమార్ మాట్లాడుతూ ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అంటరానితనాన్ని నిర్మూలించాలనే సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర కొనసాగుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నానని, తరువాత ఇక్కడి నుండి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details