ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతివృత్తిదారులను ఆదుకోవాలని తహసీల్దార్​కు వినతి - chirala aituc latest news

చీరాలలో చేతివృత్తుల వారిని ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక తహసీల్దార్ ​విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు.

aituc protest in chirala to help handicrafts people for the loss of work during lockdown
చీరాల తహసీల్దార్​కు వినతిపత్రం అందిస్తున్న ఏఐటీయూసీ

By

Published : May 11, 2020, 7:16 PM IST

లాక్​డౌన్​ కారణంగా నష్టపోయిన చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమైన భవన నిర్మాణ కార్మికులు, చేనేతలు, ఇతర రంగాల కార్మికులందరినీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకుని, ఉపాధి కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details