ప్రకాశం జిల్లా చీరాలలో పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆందోళన చేపట్టింది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.
జనాభా పెరుగుతుండగా పారిశుద్ధ్య కార్మికులను కుదించి పనిభారం పెంచారని ఏఐటీయూసీ కార్యదర్శి బత్తుల శామ్యూల్ అన్నారు.. పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, గత సంవత్సరం తీసివేసిన కార్మికులను పనులలోకి తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని అన్నారు.