ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

26న సమ్మెను జయప్రదం చేయాలని ప్రచార జాతా - citu in prakasam district news update

ఈనెల 26న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ.. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈమేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రచార జాతా నిర్వహించారు.

Aituc and citu conduct Campaign
సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రచార జాతా

By

Published : Nov 23, 2020, 10:56 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. వామపక్షాలు ఈనెల 26న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రచార జాతా ప్రారంభించారు.

ముంతావారి సెంటరు నుంచి ప్రారంభమైన కళాజాత.. పట్టణంలోని ప్రధాన వీధులు గుండా సాగింది. సీఐటీయూ, ఏఐటీయూసీ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details