పెట్రోల్, డీజిల్ ధరలపై ఏఐటీయూసీ ఆందోళనలు - prakasam district latest news
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రేపు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు... ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాధ్ వెల్లడించారు.
గత ఎనిమిది రోజులుగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఈ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు... ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాధ్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇదో పెను భారంగా మారుతుందని పేర్కొన్నారు. వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్, డీజిల్ పెంచడం దారుణమన్నారు. దీనికి నిరసనగా అన్ని కార్మిక, వాహన సంఘాలతో కలిసి ఆందోళనకు చేస్తామని రవీంద్రనాధ్ తెలిపారు.