అగ్రిగోల్డ్ బాధితులు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కోసం బాధితులు అర్జీలు పెట్టుకోవాలని పుకార్లు రావడంతో.. వేలసంఖ్యలో బాధితులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. బాధితులు ఇచ్చిన అర్జీలను అధికారులు స్వీకరించారు.పుకార్ల వల్ల రోజు కూలీ పొగొట్టుకుని... ప్రయాణ ఛార్జీలు పెట్టుకొని మరీ వచ్చామని బాధితులు వాపోయారు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఒంగోలు కలెక్టరేట్‌కు బారులు తీరిన అగ్రిగోల్డ్ బాధితులు - అగ్రిగోల్డ్ బాధితుల తాజా వార్తలు
ప్రభుత్వం అందించే సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగటంతో ఒంగోలు కలెక్టరేట్‌కు అగ్రిగోల్డ్ బాధితులు భారీగా చేరుకున్నారు.
![ఒంగోలు కలెక్టరేట్‌కు బారులు తీరిన అగ్రిగోల్డ్ బాధితులు Agrigold's victims queued up at the Ongole Collectorate in Prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5470525-119-5470525-1577110691395.jpg)
క్యూలో వేచి ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు
ఒంగోలు కలెక్టరేట్ ముందు బారులుతీరిన అగ్రిగోల్డ్ బాధితులు ..
ఇదీచూడండి.ఒంగోలులో అట్టహాసంగా బ్యాండ్ పోటీలు