Lawyers protest against CID notices: మార్గదర్శి విషయంలో మాట్లాడినందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, న్యాయవాదులు రెండోరోజూ విధులు బహిష్కరించారు. రాష్ట్రంలో న్యాయవాదుల భావస్వేచ్ఛకు సీఐడీ భంగం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ పోలీసుల తీరును నిరసిస్తూ న్యాయవాదలు పలు జిల్లాలో వివిధ చోట్ల ఆందోళన చేపట్టారు.
సీఐడీ పోలీసులు న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ… పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాయర్లు విధులు బహిష్కరించారు. నరసరావుపేట బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో..ఏపీసీఐడీ తీరును నిరసిస్తూ..కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. మార్గదర్శి విషయంలో మాట్లాడినందుకు సీఐడీ అధికారులు న్యాయవాదులకు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.
ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మార్గదర్శిపై కేసులు పెడుతున్నారని న్యాయవాదులు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మార్గదర్శి ఆడిటర్ శ్రవణ్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించిన న్యాయవాదులపై.. ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రకాశం జిల్లా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సీఏ శ్రవణ్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించినందుకు న్యాయవాదులపైనే 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వడంపై కనిగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శిపై కేవలం అక్కసుతోనే కేసులు నమోదు చేస్తూ తమను కూడా అందులోకి లాగడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అక్రమ అరెస్టులను మానుకొని సీఏ శ్రవణ్ కుమార్ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఏ శ్రవణ్ కుమార్ను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు 'మార్గదర్శి విషయంలో చర్చలో పాల్గొన్న న్యాయవాదికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇందులో సీఐడీ పోలీసుల అత్యుత్సాహంగా కనిపిస్తోంది. తన భావాలను వెల్లడించిన ఓ అడ్వకెట్కు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ప్రశ్నించే వారికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మార్గదర్శి గురించి మాట్లాడినందుకే నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు మార్గదర్శిలో తమకు అన్యాయం జరిగిందంటూ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. కేవలం సీఐడీ పోలీసులు ప్రభుత్వం కోసం పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.'- న్యాయవాదులు
ఇవీ చదవండి: