ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాహస కృత్యాల్లో శిక్షణే... విదార్థులకు రక్షణ - నెక్ట్స్‌ జెన్‌

పాఠశాలలు విద్యార్థులకు చదువులు చెప్పడానికే కాదు... మానసిక, శారీరక దృఢత్వం,లక్ష్యాలు నిర్ధేశించేవిగానూ,భవిష్యత్తుకు బంగారు బాటవేసేదిగానూ ఉండాలంటున్నారు ఒంగోలుకు చెందిన నెక్ట్స్‌ జెన్‌ పాఠశాల ఉపాధ్యాయులు. ఆ దిశగా తమ విద్యార్థులందరికి సాహస కృత్యాల్లో తగిన తర్ఫీదు ఇస్తున్నారు.

సాహస కృత్యాలపై శిక్షణ

By

Published : Sep 18, 2019, 11:27 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నెక్ట్స్‌ జెన్‌ పాఠశాలలో కొందరు విద్యార్థులు తరగతి గదుల్లో ఉంటే, మరికొందరు క్రీడా మైదానంలో ఉంటారు. గుర్రపు స్వారీ చేస్తూనో, యుద్ద క్రీడల్లో శిక్షణ పొందుతూ, రాక్‌ క్లైంబింగ్‌, టైర్స్ కోర్సుల్లో తర్ఫీదు పొందుతూ కనిపిస్తారు. అంటే విద్యార్థికి కావసిన బహుముఖ ప్రఙ్ఞ ఈ పాఠశాల అందిస్తోంది. ప్రధానంగా సాహస కృత్యాల్లో చిన్నారులు రాటుదేలేందుకు ఆప్ట్సికల్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు.. మరీ ప్రమాదకరమైనవి కాకుండా, విద్యార్థులు ఇష్టంగా, ఆసక్తిగా చేసే కోర్సుల్లో తర్ఫీదు ఇస్తారు.

పెన్కాక్‌ సలాట్‌ అనే యుద్ద క్రీడల్లో శిక్షణ పొందిన ఈ విద్యార్థులు జాతీయ స్థాయిల్లో బహుమతులు పొందారు. ఆప్ట్సికల్‌ టైర్లమీద పరిగెత్తడం, టైర్ల మధ్య నుంచీ పొర్లుకుంటూ వెళ్ళడం, చిన్న చిన్న స్తంభాలు, రాళ్ళమీద గెంతుకుంటూ పెరుగెత్తడం వంటి వాటిలో నైపుణ్యం సాధిస్తున్నారు. ఈ కోర్సులతో ఆర్మీ, నావీ, పోలీస్‌ వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలతోపాటు, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమి సీట్లు సంపాదించడానికీ ఉపకరిస్తాయి. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే తమకు, మానసిక ఉల్లాసం, ఉత్తేజం, క్రమశిక్షణ ఈ కోర్సులతో కలుగుతున్నాయని చెపుతున్నారీ విద్యార్థులు.

చదువుతోపాటు ఈ కృత్యాలతో విద్యార్థులను ఆరోగ్యవంతులుగా, లక్ష్య సాధకులుగా తయారు చేస్తున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు.విద్యార్థి దశ నుంచే ఇలాంటి శిక్షణలు, కోర్సులు అమలు చేసి మంచి యువతను తయారు చేయడమే వీరి లక్ష్యంగా పెట్టుకున్నారు.

సాహస కృత్యాల్లో శిక్షణే... విదార్థులకు రక్షణ

ఇదీ చూడండి

తిరుపతిలో 17వ జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్

ABOUT THE AUTHOR

...view details