ప్రకాశం జిల్లా ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో పడకలు చాలకపోవడంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పక్క జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో బాధితులు ఇక్కడకు వైద్యం కోసం వస్తుండటంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీన్ని నివారించేందుకు ప్రత్యమ్నాయ మార్గాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
కొవిడ్ కేర్ సెంటర్‌గా ట్రిపుల్ ఐటీ:
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు 15 కొవిడ్ కేంద్రాల్లో రోగులకు సేవలందింస్తున్నారు. ఆయా వైద్యశాలల్లో దాదాపు రెండువేల పడకలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 6 నుంచి 7 వందల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొందరు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నా.. ఆక్సిజన్ అవసరమైన, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న, ఇంటివద్ద సదుపాయం లేని వారు సర్వజన ఆసుపత్రిలో చేరేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో అదనపు పడకల ఏర్పాటుకు జిల్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒంగోలు గిరిజన్ భవన్‌లో ఇప్పటికే దాదాపు 100 పడకలు సిద్ధం చేశారు. స్థానిక ట్రిపుల్ ఐటీని కొవిడ్ కేర్ సెంటర్‌గా మారుస్తున్నారు. ఈ చర్యలతో దాదాపు 400 పడకలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు, మంచాలు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: