లాక్డౌన్ కారణంగా పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్వయంగా పరిశీలించారు. పండించిన పంట సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ధరలు పూర్తిస్థాయిలో పడిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతులను దృష్టిలో ఉంచుకొని సరైన ధరకు పంటను కొనుగోలు చేయకపోతే రానున్న రోజుల్లో పొగాకు పండించే రైతు కనిపించడన్నారు. తక్కువ రంగు వచ్చిన పొగాకును కూడా కొనుగోలు చేస్తే రైతులు కొంతవరకు నష్టాల నుంచి బయట పడతారని అన్నారు.