కొమ్మాలపాడులో రేషన్ బియ్యం పట్టివేత....
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అద్దంకి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీలారీలో సుమారుగా 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.