ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

crime: పోలీసులమంటూ దోచేశారు.. ఖాకీలకు చిక్కేశారు.. - ap crime news

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్‌ వద్ద బంగారం వ్యాపారులను బెదిరించి రూ.50 లక్షలు దోచుకున్న కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

prakasham district crime
prakasham district crime

By

Published : Sep 5, 2021, 1:43 PM IST

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద బంగారు వర్తకులు వద్ద నుంచి పోలీసులమని రూ. 50లక్షలు దోపిడీ చేసిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. దోపిడీలో ఒక పోలీసు కానిస్టేబుల్, ఓ గ్రామ వాలంటీర్‌ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నెల్లూరుకు చెందిన చిరంజీవి, అతని మిత్రులు ఆగస్టు 31న బంగారం కొనుగోలు చేసేందుకు విజయవాడకు కారులో వెళ్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని మరో కారుతో అటకాయించారు. పోలీసులమని చెప్పి అడ్డగించారు.. వ్యాపారులపై ప్రశ్నలు వేసి.. 'మీ దగ్గర లెక్కలు చూపని డబ్బు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది..మిమ్మల్ని ప్రశ్నించాలని, డీఎస్పీ గారు పిలుస్తున్నారని, పోలీస్ స్టేషన్​కు వెళ్దాం'- అంటూ వారిని నమ్మించారు.. కారులో మాటల్లోకి దింపి, నల్ల డబ్బు కాబట్టి కేసుపెడితే.. చాలా ఇబ్బందులకు గురవుతారని, ఎంతో కొంత ఇస్తే విడిచిపెడతామని బేరం కుదుర్చుకున్నారు. వ్యాపారులు తీసుకువెళ్తున్న సంచి నుంచి నగదు ఇస్తుండగా.. ఆ సంచిని లాక్కొని ఉడాయించారు. ఆ సంచిలో రూ.50 లక్షల నగదు ఉంది. వెళ్తూ.. వెళ్తూ.. సెల్ ఫోన్​లు ఇచ్చి వెళ్లి పోయారు. ఈ ఉందంతంపై మూడు రోజుల తర్వాత గుడ్లూరు పోలీసులకు వ్యాపారులు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

జాతీయ రహదారిపై భారీ దోపిడీ సంఘటన కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో సీఐ వి.శ్రీరామ్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతికత, కారు నంబరు ఆధారంగా నిందితులు కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

నిందితుల్లో కానిస్టేబుల్​, వాలంటీర్​..

నగదు అపహరణలో ప్రణాళిక రచించింది.. బంగారు వర్తకులు వద్ద పనిచేసే మేనేజర్ కాగా.. ప్రణాళికను అమలు చేసింది కానిస్టేబుల్, వాలంటీర్​. కడప జిల్లా బద్వేలుకు చెందిన కానిస్టేబుల్​కు బంగారు షాప్ మేనేజర్ సమాచారం అందించాడు.. కానిస్టేబుల్ వాలంటీర్​కు చెప్పాడు. వాలంటీర్​ తన మేనమామ వద్ద ఉన్న కొత్త ఇన్నోవా కారును తీసుకువచ్చి, దానికి పోలీస్ అని బోర్డ్ తగిలించి.. శాంతి నగర్ వద్ద జాతీయ రహదారి వద్ద కాపు కాశారు. వ్యాపారులు రాగానే ప్రణాళిక అమలు చేశారు.

కారే ఆధారం..

నిందితులు నగదు దొంగిలించి.. వెళ్లిపోతున్న సమయంలో.. వ్యాపారులు సమయస్ఫూర్తితో నిందితులు వెళ్లిన కారు ఫొటో తీశారు. మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేసి కారు ఫొటోను పోలీసులకు అందజేశారు. ఈ కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను వినియోగించి కారు ఆచూకీ కనుగొన్నారు. కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో.. ఆ జిల్లా పోలీసులను సంప్రదించారు. నిందితులు గ్రామంలోనే ఉన్నట్లు గుర్తించి.. అరెస్ట్​ చేశారు.

Fake Police: పోలీసుల పేరుతో దుండగుల దోపిడీ..రూ.50 లక్షలతో పరార్

ABOUT THE AUTHOR

...view details