ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటికలపూడి హత్య కేసులో నిందితులు అరెస్టు - నిందితుల అరెస్టు వార్తలు

ప్రేమ పేరుతో తమ కుమార్తె వెంట పడుతున్న యువకుడిని.. దంపతులు కలిసి అంతమొందించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడి గ్రామంలో ఏప్రిల్​ 24న ఈ ఘటన జరిగింది. ఈ హత్యకేసులో నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డి తెలిపారు.

murder case
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

By

Published : Jun 26, 2021, 10:49 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడి గ్రామ శివారులో ఏప్రిల్​ 24న మృతదేహం లభ్యమైంది. మృతుడు సంతనూతలపాడు గ్రామానికి చెందిన కుంచాల గణేశ్​గా గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో..ఆ సంఘటన హత్యగా తేల్చారు. మరిన్ని వివరాలు సేకరించి.. హత్యకు పాల్పడిన తన్నీరు వెంకటేశ్వర్లు, అంకమ్మరావును అరెస్టు చేశామని డీఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డి తెలిపారు.

కూతురిని వేధించినందుకు...

తన్నీరు వెంకటేశ్వర్లు, అంకమ్మరావుల కుమార్తెను కుంచాల గణేశ్​ వేధింపులకు గురి చేసేవాడని పోలీసులకు తెలిపారు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా.. వారి మాట పెడచెవిన పెట్టాడని చెప్పారు. దీంతో విసుగు చెందిన ఆ దంపతులు.. ఆ యువకుడి బారి నుంచి కూతురిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో హత్య చేయాలనుకున్నట్లు పేర్కొన్నారు. గణేశ్​ని నమ్మించి.. తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు.

ఇదీ చదవండి:Double Murder case: జంట హత్యల కేసు ఛేదన.. 15 మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details