ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో ఇండేన్ గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న లారీ.. వంతెన రక్షణ గోడను ఢీకొట్టింది. కనిగిరి-పామూరు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.సిలిండర్లు చెల్లాచెదురుగా వాగులో కొన్ని, రహదారిపై కొన్ని పడ్డాయి. సిలిండర్ల నుంచి లీకేజీ జరకగపోవడం వల్ల..పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. లారీ కడప నుంచి కనిగిరి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
accident to gas cylinder lorry: వంతెనను ఢీకొట్టిన లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ సిలిండర్లు - ongole
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో గ్యాస్ సిలిండర్ల లారీ వంతెన రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో లారీలోని గ్యాస్ సిలిండర్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. గ్యాస్‌తో ఉన్న సిలిండర్లు అక్కడ పడిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
accident to gas cylinder lorry
Last Updated : Dec 15, 2021, 11:56 AM IST