ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident in Prakasham district: పార్సిల్ వాహనం బోల్తా.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలోని నందనమారెళ్ల గ్రామ సమీపంలో(Accident in Prakasham district) బొలెరో పార్సిల్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు.

Accident
Accident

By

Published : Nov 29, 2021, 12:51 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఘోర ప్రమాదం( Accident at Nandana Marella village) జరిగింది. నందనమారెళ్ల గ్రామ సమీపంలో బొలెరో పార్సిల్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన బండారు నరసింహస్వామి (62)గా గుర్తించారు. డ్రైవర్​కి, మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details