మేకల మందను తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు బోల్తా పడ్డ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామం దగ్గర చోటు చేసుకుంది. కారులోని ముగ్గురు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతపురం నుంచి గుంటూరుకు వెళ్తుండగా మాచవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మేకల గుంపు జాతీయ రహదారిపైకి రావడం వల్ల... వాటిని తప్పించబోయి కారు బోల్తాపడిందని స్థానికులు తెలిపారు.
మేకల మందను తప్పించబోయి కారు బోల్తా... ముగ్గురికి స్వల్ప గాయాలు - machavaram village latest news
అనంతపురం నుంచి గుంటూరుకు వెళ్తున్న కారు మాచవరం వద్ద మేకల మందను తప్పించబోయి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.
మాచవరం గ్రామం వద్ద కారు బోల్తా