ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACB Rides: అనిశాకు చిక్కిన అవినీతి పోలీసు - Prakasham District Latest News

తాడివారిపల్లె పోలీసుస్టేషన్​లో పనిచేస్తున్న ఏఎస్సై ముక్కు పొలురాజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. తర్లుపాడు మండలం కొండారెడ్డిపల్లెకు చెందిన వెన్నా చెన్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఏఎస్సై పొలురాజును అరెస్ట్ చేసి నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ సూర్యనారాయరెడ్డి తెలిపారు.

ACB Rides
ACB Rides

By

Published : Jun 6, 2021, 8:12 PM IST

ప్రకాశం జిల్లా తాడివారిపల్లె పోలీసుస్టేషన్​లో పనిచేస్తున్న ఏఎస్సై ముక్కు పొలురాజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. స్టేషన్ బెయిల్ మంజూరు కోసం రైతు నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడిచేసినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. తర్లుపాడు మండలం కొండారెడ్డిపల్లెకు చెందిన వెన్నా చెన్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు.

పొలంలో గేదెలు పడి పంట నష్టం చేసిన విషయంలో ఆ గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, నాగం రవి ఘర్షణ పడ్డారు. ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చెన్నారెడ్డికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు ఏఎస్సై పొలురాజు ముందుగా 10 వేలు తీసుకున్నాడు. మరో 20 వేల కోసం వేధిస్తుండగా.. చెన్నారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. విచారించిన అధికారులు.. ఏఎస్సై పొలురాజును అరెస్ట్ చేసి నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ సూర్యనారాయరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండీ... Case filed on Somireddy: కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు!

ABOUT THE AUTHOR

...view details