ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంఛార్జ్ వీఆర్వో - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా కురిచేడులో లంచం తీసుకుంటున్న ఇంఛార్జ్ వీఆర్వోను అనిశా అధికారులు పట్టుకున్నారు. తన పొలానికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాన్ని అడిగిన రైతును ఇంఛార్జ్ వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. బాధిత రైతు అనిశా అధికారులను సంప్రదించగా..ఇవాళ వల పన్ని పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంఛార్జ్ వీఆర్వో
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంఛార్జ్ వీఆర్వో

By

Published : Mar 8, 2021, 10:10 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఇంఛార్జ్ వీఆర్వో నాగరాజు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...కురుచేడు గ్రామానికి చెందిన రైతు వెంకట రామకృష్ణ తన పొలానికి సంబంధించిన పట్టాదార్ పాస్​బుక్ మంజూరు చేయడానికి వీఆర్వోను సంప్రదించారు. కాగా పాస్ పుస్తకం జారీ చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే గతంలోనే బాధిత రైతు తండ్రి నుంచి లక్షకు ఒప్పందం కుదుర్చుకొని రూ. 70 వేలు లంచం తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. బాధిత రైతు తండ్రి ఇటీవలే మరణించగా..పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతు వీఆర్వోను అడిగాడు. మిగిలిన రూ. 30 వేలు ఇస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తానని తెలపటంతో రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. బాధితుని నుంచి వీఆర్వో రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details