ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడు వీఆర్వో రమాదేవి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డారు. ఓ రైతు తన 26 సెంట్లు పొలాన్ని మ్యూటేషన్, పట్టాదారు పాస్ బుక్ చేయించేందుకు సదరు వీఆర్వోకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం వీఆర్వో రమాదేవి రూ. 12 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరికి రూ. 10 వేలకు బేరం కుదుర్చుకుంది.
ఒంగోలు ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో మహిళా వీఆర్వో లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి సొమ్మును రికవరీ చేశారు.