విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి స్వగృహం ఎదుట బైఠాయించి ఆందోళనలు చేశారు. విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ మంత్రి ఇంటి ఎదుట ఏబీవీపీ ధర్నా - prakasam district latest news
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేశారు. ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ విడుదల చేసి డిగ్రీ అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంటి ఎదుట ఏబీవీపీ ధర్నా
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ విడుదల చేసి డిగ్రీ అడ్మిషన్లపై స్పష్టత కోరుతూ ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. ఆందోళన చేసిన సమయంలో మంత్రి ఎర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. పోలీసులు వారిని శాంతిపజేసి అక్కడి నుండి పంపేశారు.