ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రపు ఒడ్డున జాతీయజెండాతో ద్విచక్రవాహనంపై రైడింగ్ చేస్తూ.. - ప్రకాశం జిల్లా చీరాల మండలం

సముద్రపు ఒడ్డున అలలపై జాతీయజెండాతో ద్విచక్రవాహనంపై వెళుతూ.. భారత్ మాతాకీ జై అంటూ.. ముందుకు సాగాడు ఓ యువకుడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రంలో

స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు

By

Published : Aug 15, 2021, 4:16 AM IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినూత్న శుభాకాంక్షలతో

ఎందరో త్యాగధనుల పుణ్యఫలం నేటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య సాధించేందుకు దేశమాత ముద్దుబిడ్డల త్యాగాలను స్మరిస్తూ.. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రపు ఒడ్డున ఓ యువకుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేశాడు. ఈపురుపాలెం పంచాయితీ తోటవారిపాలెం వీవర్సు కాలనీకి చెందిన బూదాటి బాలశంకర్ చేనేత కార్మికుడు. కొత్తగా స్వాతంత్ర్య సంబరానికి స్వాగతం పలకాలని.. సముద్రపు ఒడ్డున అలలపై జాతీయజెండాతో ద్విచక్రవాహనంపై వెళుతూ.. భారత్ మాతాకీ జై అంటూ.. ముందుకు సాగాడు.

మరో వృద్ధురాలు రాట్నం వడుకుతూ స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం పలికింది. సమర యోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరిగులేని విజయం ఇలా సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన రోజు ఇదేనని తలచుకుంటూ యువతలో స్ఫుర్తి నింపింది.

ABOUT THE AUTHOR

...view details