ప్రకాశం జిల్లా అచ్చంపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి కోటేశ్వరమ్మ.. ఆమె భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై కనిగిరిలోని కొడుకు వద్దకు వెళ్తున్నారు. పామూరు మండలం వగ్గంపల్లి వద్ద గేదెలు అడ్డు వచ్చిన కారణంగా.. వారి బైకు అదుపుతప్పి బొల్తా కొట్టింది.
కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్తను ఆస్పత్రిలో చేర్పించారు.