అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను ఆశ్రయించింది. ఒంగోలు పీటీసీలో ఎస్‌ఐగా పనిచేస్తున్న వినోద్ కుమార్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అతని భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకొని నడిరోడ్డుపై వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రోజారాణికి ఎస్ఐ వినోద్ కుమార్కు పెదకాకానిలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు మూడు సంవత్సరాలపాటు సహజీవనం చేశారు. అనంతరం ఏడు నెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్దినెలలలోనే తనను అదనపు కట్నం కోసం వేధించసాగడని ఆవేదన వ్యక్తం చేసింది.