ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూతురితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య - prakasam district latest news

ఓ తల్లి.. తన మూడేళ్ల కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా మేడపిలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యం ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న యర్రగొండ పాలెం పోలీసులు ఘటనా స్థలాన్నికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

a woman commits suicide by jumping into a well
మూడేళ్ల కూతురితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

By

Published : May 19, 2021, 9:46 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలో విషాద చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు నేపథ్యం ఓ మహిళ..తన మూడేళ్ల కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆరేళ్ల క్రితం గ్రామానికి చెందిన గంధం సుందరరావుతో వెంకట రంగమ్మ వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.. కుమార్తె శృతి( 3 ), వెంకట సాయి (7 నెలలు). అయితే కొంత కాలంగా భార్యభర్తల గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె.. కూతురి శృతితో కలిసి బహిర్భూమికి వెళ్లింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న బావిలో కూతురితో సహా దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

బావి గట్టుపై చెప్పులు గుర్తించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామస్థుల సహాయంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. రంగమ్మ మృతదేహాన్ని వెలికి తీయగా.. కుమార్తె మృతదేహం కోసం గాలిస్తున్నారు. యర్రగొండ పాలెం సీఐ దేవప్రభాకర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూదవండి..:సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో దంపతుల ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details