ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ శివారు అద్దంకి, నార్కెట్పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఏల్చూరుకు చెందిన ఇమామ్బి రహదారి దగ్గరలో గేదెలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు వీఆర్ఎల్ ప్రైవేట్ అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమెతో పాటు రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి - two buffaloes died in elchuru
ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఏల్చూరు రహదారిపై జరిగింది.
![ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి A woman and two buffaloes were killed when a private ambulance collided.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6455023-618-6455023-1584540893764.jpg)
మృతురాలు దగ్గర ఏడుస్తున్న బంధువులు