ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగశ్రీచరిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి - పొదిలిలో నాగశ్రీచరిత కథనం

భగవద్గీత, భరతనాట్యం, కరాటే.. ఇందులో ఒకటి నేర్చుకోవడమే కష్టమైన పని. అలాంటిది ఆ చిన్నారి మూడింట్లోనూ ప్రవేశించింది. నిష్ఠగా శ్లోకాలు చెప్పేస్తూ.. సునాయాసంగా భరతనాట్యం చేస్తూ.. అలవోకగా కరాటే నేర్చుకుంటూ అందరిచేత ప్రశంసలందుకుంటోంది. అంతేకాదు.. నాట్యంలో పలుచోట్ల ప్రదర్శనలిస్తూ.. ప్రశంసా పత్రాలూ అందుకుంటోంది.

a versatile genious in podili prakasam district
నాగశ్రీచరిత

By

Published : Jan 13, 2020, 3:11 PM IST

బహుముఖ ప్రజ్ఞాశాలి నాగశ్రీచరిత

ప్రకాశం జిల్లా పొదిలిలోని పి.నాగశ్రీనివాసరావు, ఉషారాణిల కుమార్తె నాగశ్రీచరిత భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీల్లో పదిసార్లు పాల్గొని రాష్ట్ర, జిల్లాస్థాయిలో బహుమతులు అందుకుంది. భరతనాట్యంలోనూ ప్రావీణ్యం కనబరుస్తోంది. పొదిలిలో పలు సందర్భాల్లో జరిగిన సభల్లో 15సార్లు భరతనాట్య ప్రదర్శనలిచ్చింది. పొదిలిలోని ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోన్న శ్రీచరిత.. కంభాలపాడులో జరిగిన జన్మభూమి గ్రామసభలో అప్పటి జిల్లా కలెక్టర్ సుజాతశర్మ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆక్స్​ఫోర్డ్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసి అప్పటి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నుంచి సన్మానం పొందింది. నాగశ్రీచరిత ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. భగవద్గీత కంఠస్థ పోటీల్లోనూ 5సార్లు డివిజన్ స్థాయిలో ప్రథమస్థానం సాధించింది. ఆత్మరక్షణ విద్య అయిన కరాటేలోనూ రాణిస్తోంది నాగశ్రీచరిత.

ABOUT THE AUTHOR

...view details