అప్పుల బాధ కౌలు రైతు దంపతుల ఉసురు తీసింది. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందలూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొట్టిపాటి ఆంజనేయులు (62), ఫణీంద్ర (55) దంపతులు. ఆంజనేయులు సుమారు ఎనిమిదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. సాగు కలిసిరాక దాదాపు రూ.7 లక్షల వరకు అప్పులపాలయ్యారు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యారు. అప్పులవాళ్లు ఇంటికొచ్చి అడుగుతుండడంతో మనస్తాపానికి గురైన భార్య మూడు రోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా.. బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చూసిన ఆంజనేయులు మనస్తాపంతో ఆదివారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు. స్థానికులు ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆ కొద్దిసేపటికే భార్య కూడా ప్రాణాలు విడిచింది. దంపతుల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. వారికి పెళ్లయిన ఇద్దరి కుమార్తెలు ఉన్నారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు దంపతులు.. - చందలూరులో కౌలు రైతు దంపతులు ఆత్మహత్య
భూమిని నమ్ముకున్న ఆ అన్నదాతకు అప్పులే మిగిలాయి. వాటిని తీర్చే స్తోమత లేక.. ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందలూరులో ఈ ఘటన జరిగింది.
కౌలు రైతు దంపతులు ఆత్మహత్య