ప్రకాశం జిల్లా తమటంవారిపల్లి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆకుల వంశీ (18) అల్పాహారం తెచ్చుకోనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు.
పచ్చిమిరపకాయల లోడుతో వేగంగా వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టగా మరణించాడు. మృతదేహంపై పడి తల్లి విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.