ప్రకాశంజిల్లా ముండ్లమూరు వద్ద వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న వేములబండ గ్రామానికి చెందిన... గోవిందయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం కారులోని వ్యక్తులు ముండ్లమూరు స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముండ్లమూరు ఎస్సై వెంకట సైదులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం మత్తలో ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు.... - తాజా రోడ్డు ప్రమాదాలు
అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారులోని వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
![మద్యం మత్తలో ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు.... car collided with a two-wheeler](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9380708-166-9380708-1604193960014.jpg)
కారు , ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నది