ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు వెళ్తున్న గరుడ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది.
అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - అయ్యవారిపల్లి రోడ్డు ప్రమాదం న్యూస్
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అయ్యవారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

road accident near ayyavaripalli