ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్షమించు బంగారం.. చనిపోతున్నా.. నా చివరి కోరిక ఇదే' - crime in prakasam

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో యువకుడు ఫ్యాన్​కు ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ కారణం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. త్వరలో ఆ యువకుడికి వివాహం జరగాల్సి ఉంది.

a person committee suicide in prakasam dst markapuram
మార్కాపురంలో యువకుడు ఆత్మహత్య.
author img

By

Published : Mar 17, 2020, 4:18 PM IST

మార్కాపురంలో యువకుడు ఆత్మహత్య.

ప్రకాశం జిల్లా ప్రకాశం మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఇంట్లో యువకుడు ఫ్యాన్​కు ఉరేసుకొని మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడిని తర్లుపాడు మండలం నాగేళ్ళముడుపు గ్రామానికి చెందిన సంపత్​కుమార్​గా గుర్తించారు. పండ్ల వ్యాపారం నిమిత్తం 2 నెలల కిందట మార్కాపురానికి వచ్చి నివాసం ఉన్నట్లు ఇంటి యజమాని తెలిపారు. మృతుడి జేబులో ఉన్న ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఇలా రాసి ఉంది.

ఇదే నా చివరి కోరిక...

'సారీ బంగారం. నీతో ఎంగేజ్ మెంట్ చేసుకొని చనిపోతున్నాను. సారీ రా మాధవి సారీ. నువ్ నాకు ఎంతో చేశావ్. డబ్బులు పెట్టావ్, హాస్పటల్ లో చూపించారు. నా కోసం ఎన్నో చేశావ్. కనీసం నీకు కూడా చెప్పకుండా వెళ్లి పోతున్నాను సారీ. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి గారికి మనవి సార్ నా మట్టి ఖర్చులు మీరే జగనన్న కు చెప్పి ఇప్పించండి ప్లీజ్ సార్. అమ్మా సారీ అమ్మా. నా అన్నలు మాత్రం నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుడదు.' ఇదే నా చివరి కోరిక. అని రాసి ఉంది.

ఇదీ చూడండి:

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details