ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేటలో రమాదేవి అనే మహిళను హరిబాబు అనే వ్యక్తి కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. లైంగిక దాడికి ప్రతిఘటించిందన్న కోపంతోనే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ తెలిపింది. ఈ దాడిలో మహిళ చేయి, తల, తొడబాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
మహిళపై లైంగిక దాడికి యత్నం.. అటుపై కత్తితో దాడి - person attacked on a women with a knife in Mirzapet
లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను కత్తితో తీవ్రంగా గాయపరిచాడు ఓ దుండగుడు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేటలో ఈ ఘటన జరిగింది.
![మహిళపై లైంగిక దాడికి యత్నం.. అటుపై కత్తితో దాడి దాడిలో గాయపడిన మహిళ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12079407-807-12079407-1623302538356.jpg)
దాడిలో గాయపడిన మహిళ
Last Updated : Jun 10, 2021, 10:59 AM IST