దేవాలయాల్లో హుండీల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వేటపాలెం మండలం దంతంపేట ప్రసన్నాంజనేయ దేవాలయం, కారంచేడు మండలం కంకలమర్రులోని మసీదులో హుండీ ఎత్తుకెళ్లాడని తెలిపారు.
ఈ రెండు ఘటనలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీరాల ఐక్యనగర్‌కు చెందిన శ్యామ్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి సొత్తు రికవరీ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్ తెలిపారు. సమావేశంలో చీరాల రూరల్ సీఐ రోశయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.