ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం వడ్డే సంఘానికి చెందిన టి.ఏడుకొండలు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు. గురవారం రాత్రి పనిమీద వేటపాలెంకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఇసుక కుప్ప కనపడకపోవటం వల్ల అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా... చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బైక్ అదుపుతప్పి కిందపడ్డ వృద్ధుడు... చికిత్స పొందుతూ మృతి - old man died in a road accident at vetapalem
ద్విచ్రవాహనంపై వెళ్తున్న ఓ వృద్ధుడు... రోడ్డుపై ఉన్న ఇసుక కుప్పను తప్పించబోయి అదుపుతప్పు కిందపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతను చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జరిగింది.
బైకు అదుపుతప్పి కిందపడ్డ వృద్ధుడు... చికిత్స పొందుతూ మృతి