కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లి గుండె పోటుతో మృతిచెందిన విషాద సంఘటన... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లెలో జరిగింది. మృతురాలు ఆదిలక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ... జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె రమణమ్మను మార్కాపురం మండలం బిరుదుల నరవ గ్రామానికి చెందిన కొండారెడ్డికి ఇచ్చి వివాహం చేసింది. అక్కడ పనులు దొరక్క రమణమ్మ దంపతులు హైదరాబాద్ వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఉన్నట్టుండి గురువారం సాయంత్రం రమణమ్మకు గుండె నొప్పి వచ్చి మృతిచెందింది. కూతురు మరణవార్త విన్న ఆదిలక్ష్మమ్మ... గంట వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోయింది.
గంట వ్యవధిలోనే... తల్లీ, కూతురు మృతి - death news in nikarmpalle prakasham district
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లెలో విషాదం జరిగింది. కూతురు మరణాన్ని తట్టుకోలేక... ఓ తల్లి గుండెపోటుతో మృతి చెందింది.
గుండె పోటుతో మృతి చెందిన తల్లి ,కుమార్తె