ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనం బోల్తా... వార్డు సభ్యురాలి భర్త మృతి - ప్రకాశంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి న్యూస్

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ళ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దిరిశవంచ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా తన భార్య గెలుపొందిన విషయాన్ని.. నందనమారెళ్ళలోని తన చెల్లెలికి చెప్పేందుకు వెళ్లిన వ్యక్తి.. ద్విచక్రవాహనంపై తిరిగొచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

A man was killed in a road accident in Kanigiri zone of Prakasam district
ద్విచక్ర వాహనం బోల్తా... వార్డు సభ్యుడు మృతి...

By

Published : Feb 18, 2021, 9:11 PM IST

Updated : Feb 18, 2021, 9:49 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో దిరిశవంచ గ్రామానికి చెందిన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న జరిగిన దిరిశవంచ పంచాయతీ ఎన్నికల్లో రెండో వార్డు సభ్యురాలిగా కిషోర్ భార్య గెలుపొందారు.

ఈ సంతోషాన్ని నందనమారెళ్ళలోని తన చెల్లెలుతో పంచుకోవడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఆయన తిరిగొచ్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి తేదేపా ఇంచార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి.. ఆసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Last Updated : Feb 18, 2021, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details