ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన అమ్మటి శ్రీనివాసరావు నిరుపేద. నవరత్నాల్లో భాగంగా ఇంటి స్థలం ఇస్తారని ఆశపడ్డాడు. ఆశ నిరాశై మనస్తాపం చెందిన అతను ఈ నెల 26న పురుగుమందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇంటి స్థలం మంజూరు కాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య - నవరత్నాల్లో భాగంగా ఇళ్లు మంజూరు కాలేదని ప్రకాశం జిల్లా ఓ వ్యక్తి ఆత్మహత్య
ఇంటి స్థలం మంజూరు కాలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా లింగంగుంట గ్రామంలో చోటు చేసుకుంది.

ఇంటి స్థలం మంజూరు కాలేదని మనస్తాపంలో వ్యక్తి అత్మహత్య
శ్రీనివాసరావు భార్య 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందిందని అతని బంధువులు తెలిపారు. కుమార్తె అఖిల ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇతనికి ఇల్లు, స్థలం లేదు.. ప్రభుత్వం మృతుడి కుబుంబానికి చేయూత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.