గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన షాజహాన్, జానీబాషా పండ్ల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం ద్విచక్రవాహనంపై వ్యాపారం పని మీద ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు. కొచ్చెర్లకోట వద్ద గుండ్లకమ్మవాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు. నీటీ ప్రవాహంలో షాజహాన్ కొట్టుకుపోగా... జానీబాషా సురక్షితంగా బయటపడినట్లు ఎస్సై ఫణిభూషణ్ వివరించారు.
ఎంత వెతికినా నిరాశే...