ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో బోల్తా పడి యువకుని మృతి.. ఒకరికి గాయాలు - auto accidents in prakasam news

ఆటో బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలు కాగా.. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా పడి యువకుని మృతి.. ఒకరికి గాయాలు
ఆటో బోల్తా పడి యువకుని మృతి.. ఒకరికి గాయాలు

By

Published : Jun 15, 2020, 3:40 AM IST

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మరపగుంట్ల గ్రామ సమీపం వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. వాహన చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కనిగిరి మూడో వార్డుకు చెందిన బండి నవీన్​ కొత్త ఆటో కొన్నాడు. తన స్నేహితుడైన అల్లూరయ్యను ఆటోలో ఎక్కించుకుని మరపగుంట్ల వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో అల్లూరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నవీన్​కు తీవ్ర గాయాలయ్యయి. బాధితుణ్ని స్థానికులు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details