ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder Attempt: భార్యా బిడ్డలపై కర్కశత్వం.. విద్యుత్తు తీగలు చుట్టి.. - దర్శిలో భార్యా బిడ్డలపై హత్యాయత్నం

murder attempt : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కాటికి పంపాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. భార్యా బిడ్డలకు విద్యుత్​ తీగలు చుట్టి షాాక్​ ఇచ్చి మట్టుబెట్టేందుకు యత్నించాడు. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

Electric shock
Electric shock

By

Published : Feb 22, 2022, 2:58 PM IST

భార్యా బిడ్డలపై కర్కశత్వం.. విద్యుత్తు తీగలు చుట్టి హత్యాయత్నం

murder attempt : విద్యుత్తు తీగలు చుట్టి భార్యా బిడ్డలను హత్య చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా దర్శిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్‌ తెలిసిన వివరాల ప్రకారం.. పొదిలి మండలంలోని సూదనగుంట రామాపురం గ్రామానికి చెందిన దేశం రమణారెడ్డికి దొనకొండ మండలం నారసింహనాయునిపల్లికి చెందిన కెజియాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు రేవంత్‌ (6) ఉన్నాడు. రమణారెడ్డి సినిమా హాలును లీజుకు తీసుకుని నిర్వహిస్తుంటాడు. ప్రస్తుతం దర్శిలోని పొదిలి రోడ్డులో వీరు నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానంతో తరచూ ఆమెను దూషిస్తూ కొట్టేవాడు. ఇటీవల గొడవలు తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి ఆమెను రమణారెడ్డి తీవ్రంగా గాయపరిచాడు. కుమారుడి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. అంతేగాక ఇద్దరి శరీరాలకు తీగలు చుట్టి విద్యుదాఘాతం ద్వారా మట్టుబెట్టేందుకు యత్నించాడు. దీంతో రేవంత్‌ శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి కేకలకు నిద్ర లేచిన ఇంటి యజమాని అక్కడికి చేరుకోవడంతో రమణారెడ్డి పరారయ్యాడు. బాధితులకు దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి ఒంగోలు తరలించారు. కెజియా ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details