ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టోల్​ సిబ్బందిపై వ్యక్తి దాడి.. సెక్యూరిటీ గార్డుకు గాయాలు - టోల్​ సిబ్బందిపై దాడి వార్తలు

టోల్​ప్లాజా వద్ద సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి​ దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది. బాధితుణ్ని టోల్​ప్లాజా సిబ్బంది ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

టోల్​ సిబ్బందిపై వ్యక్తి దాడి.. సెక్యూరిటీ గార్డుకు గాయాలు
టోల్​ సిబ్బందిపై వ్యక్తి దాడి.. సెక్యూరిటీ గార్డుకు గాయాలు

By

Published : Jul 9, 2020, 8:14 AM IST

టోల్​ సిబ్బందిపై వ్యక్తి దాడి

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్​ప్లాజా వద్ద సిబ్బందిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. 16వ నెంబర్​ జాతీయ రహదారిపై టోల్​గేట్​ వద్ద రాత్రి కావలి నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న కారు లైనులో వెళ్తుండగా సెక్యూరిటీ గార్డు ప్రతాప్​ వారించాడు. దీనిపై ఆగ్రహించిన కారు డ్రైవర్​ సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఈ క్రమంలో గార్డు ప్రతాప్​ రహదారిపై పడిపోయాడు.

గాయపడిని బాధితుణ్ని టోల్​ప్లాజా సిబ్బంది ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఈ తతంగమంతా అక్కడ సీసీ కెమెరాలో నమోదైంది. దాడి ఘటనపై టోల్​ప్లాజా సిబ్బంది మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details