ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లుడిపై కత్తితో మామ దాడి.. మృతి - a man attacked to son in law in prakasam

అల్లుడిపై మామ, అతని కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేసిన ఉదంతం ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. ఈ ఘటనలో అల్లుడు మృతి చెందగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అల్లుడిపై కత్తితో మామ దాడి.. మృతి
అల్లుడిపై కత్తితో మామ దాడి.. మృతి

By

Published : Jun 1, 2020, 8:01 PM IST

Updated : Jun 1, 2020, 8:48 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం సాయికాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అల్లుడిపై మామ, అతని కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అల్లుడి దిలీప్​నకు తీవ్ర గాయాలు కాగా.. అతన్ని స్థానికులు చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దిలీప్​ మృతి చెందాడు. దీనిపై చీరాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దలు రాజీ కుదిర్చే యత్నంలో

చీరాలకు చెందిన మోటా దిలీప్​, రిబ్కాలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వీరు విడిగా ఉంటున్నారు. పెద్దలు వీరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుండగా.. మామ అల్లుళ్ల మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మామ పెరిగ చిన్ని, ఆయన కుటుంబ సభ్యులు దిలీప్​పై దాడికి దిగారు.

ఇదీ చూడండి..

'మద్యం, నగదు లావాదేవీలే అపహరణకు కారణం'

Last Updated : Jun 1, 2020, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details