ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన గురుప్రసాదరెడ్డి... బుధవారం తెల్లవారుజామున తన భార్యపై కత్తితో దాడి చేశాడు. ఊహించని ఈ పరిణామానికి భార్య వణికిపోయింది. ఆమె కేకలు వేయటంతో భర్త పలాయనం చిత్తగించాడు. కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను దర్శిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గురుప్రసాదరెడ్డి అక్కడ నుంచి దొనకొండ వైపు వెళుతూ... చినగుడిపాడు వద్ద లారీని ఆపి ఎక్కాడు. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లయిన పదిరోజులకే భార్యపై దాడి... - ప్రకాశం జిల్లా క్రైమ్ వార్తలు
ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. వివాహం జరిగిన 10 రోజులకే భార్యపై కత్తతో దాడి చేశాడు. అనంతరం పారిపోతూ మరో ఆరుగురిపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది.
attack
పెళ్లైన పది రోజులకే...
గురుప్రసాద రెడ్డికి... దుర్గామల్లేశ్వరికి వివాహం జరిగి 10 రోజులే అయింది. వీరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. అతను తన భార్యపై ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి ఉంది. అయితే స్థానికులు గురుప్రసాద రెడ్డికి మతిస్థిమితం లేదని చెబుతున్నారు. మరోవైపు అతని మొదటి భార్య కూడా వివాహమైన 10 రోజులకే వెళ్లిపోయిందని దుర్గామల్లేశ్వరీ తెలిపింది.
ఇదీ చదవండి