Lorry Accident in Medarametla: ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేదరమెట్లకు సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ముందు ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక లారీ డ్రైవర్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మృతుడు చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Accident at Medarametla: మేదరమెట్లలో రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి - మెదరమెట్ల ప్రమాదంలో చనిపోయిన లారీ డ్రైవర్
Lorry Accident in Medarametla: ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
లారీని ఢీకొన్న మరో లారీ..డ్రైవర్ మృతి