ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులపై వైద్యుడు హరి దురుసుగా ప్రవర్తించాడు. వైద్యం చేయించుకునేందుకు వచ్చిన బాలీ భాయ్ అనే వృద్ధురాలు నిస్సహాయ స్థితిలో వైద్యుడి గదిలో కూర్చుంది. నువ్వు ఇక్కడ కూర్చునేదానివా అంటూ వృద్ధురాలిని దుర్భాషలాడుతూ, పిడి గుద్దులు గుద్దాడు. అదేంటని ప్రశ్నించిన ఆమె మనుమరాలు లాలూబాయ్పై కుడా దాడి చేసినట్లు పలువురు తెలిపారు. ఎక్కువమంది రోగులున్నప్పుడే ఘటన జరగడంతో అతని నిర్వాకాన్ని అందరూ తప్పుపట్టారు. దీనితో ఒకింత ఆందోళన చోటు చేసుకుంది. మార్కాపురం పోలీసు స్టేషన్లో వైద్యుడు హరిపై బాధితులు పిర్యాదు చేశారు. గదిలో కూర్చుంటే బయటకి వెళ్లిపో అని చెప్పితే బాగుండేది కానీ.. ముసలవ్వను కొట్టడం న్యాయమేనా.. ఇది వైద్యులకు తగినదేనా అని బామ్మ మనుమరాలంటోంది.
వృద్ధురాలినయ్యా...నన్ను కొట్టడం నీకు న్యాయమేనా! - prakasham
వైద్యో నారాయణ హరి అంటాం. జీవం పోసే వైద్యుడే రోగులపై పిడిగుద్దులు గుద్దితే..! పాపం ముసలవ్వ.. నిలబడలేక వైద్యుడి గదిలో కూర్చున్న పాపానికి వైద్యుడి చేత దెబ్బలు తినాల్సి వచ్చింది.
వృద్ధురాలిని కొట్టిన వైద్యుడు