ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని కోడూరివారిపాలెంకు చెందిన మత్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడు. చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రళయకావేరి బాబు (26) వల వేసే క్రమంలో నీళ్లలో పడిపోయాడు. వేటకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా తిరిగి రావటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వేటకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి - చినగంజాం తాజావార్తలు
ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు.
![వేటకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి fisherman died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9242025-841-9242025-1603179752472.jpg)
వేటకు వెళ్లి మరణించిన వ్యక్తి