ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...! - నల్ల గోధుమ పంట సాగు వార్తలు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...! శ్రమ తక్కువ..... ఆదాయం ఎక్కువ..! పంటకు మార్కెట్లో మంచి డిమాండ్‌......! వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఇప్పుడీ మూడు సూత్రాలే కీలకం.! వాటినే అనుసరించాడు ప్రకాశం జిల్లా వాసి.! ఉద్యోగం వదిలేసి.. సాగుబడిలోకి దిగారు. నల్ల గోధుమలు సాగు చేశాడు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...!

By

Published : Jan 17, 2021, 6:13 AM IST

Updated : Jan 17, 2021, 6:46 AM IST

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి...!

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం.... టి.అగ్రహారానికి చెందిన శ్రీనివాసరావు. వ్యవసాయానికి కొత్త. సీఆర్​పీఎఫ్​లో ... 21 ఏళ్లపాటు పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాసరావు.....గోధుముల సాగుపై ఓ అవగాహన తెచ్చుకున్నారు. కరోనా ప్రభావంతో...... ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్న విషయాన్ని గ్రహించారు. వ్యవసాయ శాస్త్రేవేత్తలు,.. అధికారుల సలహా తీసుకుని.... నల్ల గోదుముల సాగు చేశారు. వీటికి మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుందంటున్నారు శ్రీనివాసరావు.

మూడు నెలల క్రితం సాగుచేసిన నల్లగోధమ.. ఇప్పుడు కంకిదశకు వస్తోంది.సంప్రదాయపంటల సాగుతో ఏటా నష్టపోతున్న రైతులు.... శ్రీనివాసరావు పొలం వద్దకు వచ్చి .. నల్లగోధుమల సాగు గురించి ఆరాతీస్తున్నారు.వ్యవసాయ అధికారుల సూచనలతోపాటు.... యూటూబ్‌లో చూసి ఎప్పటికప్పుడు పంట సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాసరావు. మరో 3నెలల్లో దిగుబడి చేతికొస్తుందని చెప్తున్నారు.

ఇవీ చదవండి

143 మంది నుంచి రూ.24 కోట్ల వసూలు!

Last Updated : Jan 17, 2021, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details