ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిన్ననందిపాడుకు చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాధినేని రమేష్ అనే రైతు ఈ ఏడాది 30 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. నివర్ ప్రభావంతో మిరప, శనగ, పొగాకు పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా మనస్తాపానికి గురైన రమేష్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాను ప్రభావంతో ఇప్పటికే మూడు సార్లు మిరప మొక్కలు నాటాడు. మళ్లీ నాటేందుకు అప్పులు చేయలేక, ఉన్న అప్పులతో ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.
ధైర్యం చెప్పారు..అంతలోనే ఆత్మహత్య